Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేసింది.. ఆలౌట్ తాగేశాడు.. గాజు పెంకుతో?

Updated: బుధవారం, 14 నవంబరు 2018 (16:19 IST)
ప్రేమించిన అమ్మాయి ముఖం చాటేసింది. అంతే ఈ యువకుడు ఆలౌట్ తాగేశాడు.. చేతిని గాజు పెంకుతో కోసేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిన్న కన్నేపల్లికి చెందిన హర్ష (21) బీసిఏ చదివాడు.


విజయవాడలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు. హార్డ్‌వేర్‌లో శిక్షణ పొందేందుకు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. ఎస్‌.ఆర్‌.నగర్‌లోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. 
 
కానీ హర్ష ప్రేమించిన యువతి మాట్లాడక పోవడం, ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తుండడంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యా యత్నం చేశాడు. తాను చనిపోతున్నానని సోదరునికి ఫోన్‌ చేసి చెప్పి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 
 
గాజు పెంకుతో చెయ్యి కోసుకోవడమే కాక, ఆలౌట్‌ కూడా తాగేశాడు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హర్ష ప్రేమించిన యువతి ఇటీవలే బదిలీపై హైదరాబాద్‌ వచ్చింది. వచ్చినప్పటి నుంచి ముఖం చాటేస్తుండటంతో.. మనస్తాపంతో హర్ష ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments