శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 9 ఆగస్టు 2021 (10:23 IST)

వెంక‌టాచలంలో అక్ర‌మ త‌వ్వ‌కాలు! టిప్ప‌ర్లను అడ్డుకున్న గ్రామ‌స్తులు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి బరితెగించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నార‌ని గ్రామ‌స్తులు నిర‌స‌న తెలిపారు. మైనింగ్ మాఫియా ట్రాక్ట‌ర్ల‌ను, టిప్ప‌ర్ల‌ను అడ్డుకున్నారు. వెంకటాచలం మండలం కంటేపల్లిలోని అటవీ భూముల్లో భారీ ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జ‌రుగుతున్నాయి.

జూన్ 22న 5 ప్రొక్లెయిన్లు, 19 టిప్పర్లు పట్టుబడిన చోటే మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి ఓ టిప్పర్  తగిలి తెగి కంటేపల్లి ఎస్సీ కాలనీలో ఇళ్ల మీద విద్యుత్ తీగలు తెగిప‌డ్డాయి. త్రుటిలో అగ్నిప్ర‌మాదం తప్పింది. దీనితో కాలనీవాసులందరూ ఏకమై టిప్పర్ల అడ్డగించారు. 
 
ఓ వైపు నిరసన కొనసాగుతుంటే మరో వైపు మిగిలిన టిప్పర్లతో గొలగమూడి మీదుగా గ్రావెల్ తరలిస్తున్నార‌ని గ్రామ‌స్తులు ఆరోపించారు. దీనికి అధికార పార్టీ అండ‌దండ‌లున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.

గ్రావెల్ ర‌వాణాను అడ్డుకుంటున్న త‌మ‌నే పోలీసులు టార్గెట్ చేస్తున్నార‌ని, త‌మపైనే నిర్బంధం విధిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. దీనిని బ‌ట్టి అక్ర‌మ త‌వ్వ‌కాల వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. వెంట‌నే  వెంక‌టాచ‌లం అట‌వీ భూముల్లో అక్ర‌మ త‌వ్వ‌కాలు ఆపాల‌ని గ్రామ‌స్తులు డిమాండు చేస్తున్నారు.