ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (21:45 IST)

దుబాయ్‌లో తెలంగాణ వాసికి రూ. 7 కోట్లు లక్కీ డ్రా

దుబాయ్‌లో తెలంగాణ వాసిని అదృష్టం ఆహ్వానించింది. దుబాయ్‌లో జరిగిన లక్కీ డ్రాలో తెలంగాణవాసి విజేతగా నిలిచారు. తెలంగాణకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ రూ.7.3 కోట్లు లక్కీ డ్రాను గెలుచుకున్నారు. లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లక్కీ డ్రా కాంటెస్ట్‌లో రూ.7.3 కోట్లు గెలుచుకున్నాడని గల్ప్ న్యూస్ వెల్లడించింది.
 
దుబాయ్‌లో 1999 నుంచి మిలీనియమ్ మిలియనీర్ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కింద 1 మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.7.3 కోట్లు) ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఏడాది క్రితం దుబాయ్‌కి ఉద్యోగం కోసం వెళ్లిన 34 ఏళ్ల లక్ష్మీ వెంకట తాతారావు గ్రంథి లాటరీ టికెట్ కొన్నాడు. డ్రాలో అతడే మొదటి ప్రైజ్ గెలుచుకున్నాడు.
 
ఈ డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. అదృష్టం అడపాదడపా చెప్పకుండా తలుపు తడుతుందనే దానికి ఇది చక్కని నిదర్శనం.