బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:35 IST)

ఐపీఎల్-13వ సీజన్.. రైనా సంగతేంటో కానీ.. సీఎస్కే ధోనీపై భారం..

ఐపీఎల్ 13వ సీజన్‌కు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సీఎస్కే జట్టుకు కరోనా కాటు తప్పలేదు. ఆగస్టు 21న దుబాయ్‌కి వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంది. అదే సమయంలో ఇద్దరు ఆటగాళ్లు 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆ జట్టులో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే రైనా భారత్‌కు తిరిగి వెళ్లిపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 
 
అతడు కరోనాకు భయపడి వెనుదిరిగాడని, అలాగే హోటల్‌ గది నచ్చక జట్టుతో విభేదాలు వచ్చాయని, మరోవైపు పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో వచ్చాడంటూ అనేక కథనాలు ప్రసారమయ్యాయి.
 
చివరికి సీఎస్కే యజమాని శ్రీనివాసన్‌ కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడనే ఊహాగానాలూ వచ్చాయి. వీటన్నింటిపై స్పందించిన రైనా గురువారం ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండడమే శ్రేయస్కరమని భావించి తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అనేది తెలియాల్సింది.
 
ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ట్విటర్‌లో సీఎస్కేను ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఈసారి మన వైస్‌ కెప్టెన్‌ ఎవరని అడిగాడు. దానికి స్పందించిన ఆ జట్టు అంతే ధీటుగా సమాధానమిచ్చింది. మనకు తెలివైన సారథి ధోనీ ఉండగా ఇక భయమెందుకు? అని తిరిగి ప్రశ్నించింది.