ఐపీఎల్‌లో రీఎంట్రి.. సురేష్ రైనా అందుకే హింట్ ఇచ్చాడా?

suresh raina
Suresh Raina
సెల్వి| Last Updated: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (21:03 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పటికే కరోనా దెబ్బ తగిలింది. ఇప్పటికే సురేష్ రైనా, భజ్జీ తప్పుకున్నారని తెలుస్తోంది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఆ టోర్నీకి దూరమయ్యాడని అందరూ అనుకున్నారు. అయితే సీఎస్‌కే బాట్స్‌మెన్ సురేష్ రైనా ఐపీఎల్‌లో రీఎంట్రి ఇచ్చే సూచనాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్-2020 నుంచి అర్థంతరంగా తప్పుకున్న ఈ స్టార్ బాట్స్‌మెన్ మళ్ళి టీంతో జాయిన్ అయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా తన పునరాగమనంపై హింట్ ఇచ్చాడు. "ప్రస్తుతం నేను క్వారంటైన్‌లో ఉన్నప్పటికి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా.. మళ్ళి ఐపీఎల్ టీంలో జాయిన్ అవోచ్చు ఏమో"అంటూ రీఎంట్రీపై హింట్ ఇచ్చారు. తాను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, దీంతో ఎవర్నీ కలవడం లేదన్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగిన సీఎస్‌కే ఆటగాడు సురేశ్ రైనాపై ఇటీవల ఆ జట్టు యజమాని శ్రీనివాసన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సురేష్ రైనా దీనిపై స్పందిస్తూ "ఆయన నాకు తండ్రి లాంటి వారు. ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటారు. నా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఆయన నన్ను తన చిన్న కొడుకులా చూసుకుంటారు. ఆయన ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలను. ఏక్ బాప్ అప్నే బచ్చే కో డాంట్ సక్తా హై" అని రైనా అన్నాడు.దీనిపై మరింత చదవండి :