బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (19:09 IST)

మౌనం వీడిన సురేష్ రైనా .. ఐపీఎల్ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే...

ఐపీఎల్ 2020 సీజన్ ‌కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో కలిసి యూఏఈకి వెళ్లిన క్రికెటర్ సురేష్ రైనా అర్థాంతరంగా స్వదేశానికి తిరిగివచ్చారు. దీంతో ఆయన జట్టు యాజమాన్యంపై అలిగి వచ్చేశారనీ, ఇకపై ఐపీఎల్ టోర్నీలో ఆడబోరంటూ ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చే జరిగింది. 
 
దీంతో సురేష్ రైనా మౌనం వీడారు. తమ కుటుంబంలో చోటుచేసుకుందని చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే యూఏఈ నుంచి వెనక్కి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 'పంజాబ్‌లో మా కుటుంబంపై భయంకరమైన దాడి జరిగింది. మా అంకుల్‌ను చంపేశారు. మా మేనత్త, నా ఇద్దరు కజిన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టవశాత్తు గత రాత్రి నా కజిన్‌ ఒకరు ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందారు.
 
మా మేనత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందో మాకు ఇంతవరకు తెలియలేదు. ఎవరు ఈ దాడి చేశారో అర్థం కావడంలేదు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా పంజాబ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. 
 
అత్యంత హేయమైన పాల్పడిన నేరస్తుల గురించి కనీస వివరాలు తెలుసుకునే అర్హత మాకు ఉందని భావిస్తున్నా. అలాంటి నేరగాళ్లు మరిన్ని నేరాలకు పాల్పడకుండా చూడాలి' అని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు సురేశ్‌ రైనా విజ్ఞప్తి చేశాడు.