సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:23 IST)

దుబాయ్ బీచ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ సందడే సందడి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ముంబై ఇండియన్స్ జట్టు దుబాయ్‌కు వెళ్లింది. జట్టు సభ్యులతో పాటు.. పలువురు క్రికెటర్లు తమ భార్యాపిల్లలను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ దుబాయ్ బీచ్‌లో సందడి చేసింది. 
 
దుబాయ్‌లో అడుగుపెట్టిన తర్వాత అనంత‌రం కొన్నిరోజులు క్వారంటైన్‌ నిబంధనలను పాటించారు. ఆ తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ చేసిన క్రికెట‌ర్లు కాస్త విరామం దొర‌క‌డంతో అక్క‌డి పర్యాట‌క ప్ర‌దేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. 
 
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అక్క‌డి బీచ్‌లో భార్యాపిల్ల‌ల‌తో ఎంజాయ్ చేసి, ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న త‌న సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేశాడు.
 
ఆయ‌నే కాకుండా ముంబై ఇండియ‌న్స్ ఇత‌ర ఆట‌గాళ్లు కూడా బీచ్‌లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ముంబై ఇండియన్స్ త‌మ అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.