శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (14:34 IST)

కోహ్లీ అంటేనే కంగారూలకు వణుకు.. స్లెడ్జింగ్ అస్సలు చేయరు.. మైకేల్ క్లార్క్

ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు అసలు ప్రయత్నించరని ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు అసలు ప్రయత్నించరని మైకేల్ క్లార్క్ చెప్పాడు. 
 
టీమిండియా క్రికెటర్లను చూసి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ భయపడుతున్నారని.. తమ ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకునేందుకు కొన్నేళ్లుగా కోహ్లీసేనను స్లెడ్జింగ్ చేయడం ఆపేశారన్నాడు. 
 
అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంతటి శక్తివంతమైనదో అందరికి తెలిసిన విషయమేనని క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా మాత్రమే కాదు.. మిగిలిన క్రికెట్ జట్లు కూడా కోహ్లీ అండ్ టీమ్‌ను స్లెడ్జ్ చేయడానికి ఆలోచిస్తాయని క్లార్క్ అన్నాడు. 
 
ఎందుకంటే ప్రతీ ఏడాది భారత ఆటగాళ్లతో కలిసి వారు ఐపీఎల్ ఆడాలని వారికి తెలుసు. ఐపీఎల్ ద్వారా మిలియన్ డాలర్లు సంపాదించవచ్చునని.. అందుకే కోహ్లిని వారు స్లెడ్జ్ చెయ్యరని క్లార్క్ వ్యాఖ్యానించాడు.