గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (10:42 IST)

కోనసీమలో ఇంటర్నెట్ సేవలు కట్: గోదావరి నది ఒడ్డున టెక్కీలు..?

Konaseema
Konaseema
కోనసీమలో ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. అమలాపురంలో అల్లర్ల తర్వాత జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇంటర్నెట్ సర్వీస్ కట్ చేశారు. దీంతో ముక్తేశ్వరంలోని ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. దీంతో జిల్లాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టం వచ్చి పడింది. 
 
ఇంటర్నెట్ బంద్ కావడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు. అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ వస్తుండటంతో ల్యాప్ ట్యాప్‌లు అక్కడికి తీసుకెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. 
 
అమలాపురంలో విధ్వంసకాండ జరిగి మూడు రోజులు కావొస్తోంది. అమలాపురం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది.
 
అల్లర్లు జరిగిన మరుసటి రోజు నుంచి కూడా పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరక్కుండా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
అయితే, అమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.