శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (21:53 IST)

శునకానికి ఐపీఎస్ సెల్యూట్.. ఎక్కడ?.. ఎందుకు?

మచిలీపట్నం పోలీసు శాఖలో విశిష్ట సేవలందించి, వాసన చూసి నేరస్తులను ఇట్టే  పసిగట్టే పోలీసు జాగిలం 'రాజా' శుక్రవారం తెల్లవారుఝామున అనారోగ్యంతో మృతి చెందింది. గత ఆరు సంవత్సరాలుగా జిల్లా పోలీసు శాఖలో సేవలందిస్తున్న రాజా నేరస్తులను కనిపెట్టడంలో తనదైన శైలిని ప్రదర్శించేది.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికార లాంఛనాలతో ఆర్ముడు రిజర్వు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాగిలం రాజా చేసిన సేవలు మరువలేనివన్నారు. రాజా మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నామన్నారు.రాజా పోలీసు జాగిలం కృష్ణా జిల్లా పోలీసు శాఖలో గత 6 సంవత్సరాలుగా విశిష్ట సేవలందించిందని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించటం బాధాకరం అన్నారు.

ఆరు సంవత్సరాల కాలంలో మంచి ప్రతిభ కనబరిచి కీలకమైన కేసులను పోలీసు శాఖకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. 2014 సంవత్సరంలో హైదరాబాద్ మొయినాబాద్ లో ఎనిమిది నెలల కాలం పాటు శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు రావడం జరిగిందని, శిక్షణ కాలంలోనే రాజా ప్రతిభకు సిల్వర్ మెడల్ కైవసం చేసుకుందని తెలిపారు.

2015 లో హర్యానాలో జరిగిన ఆల్ ఇండియా పోలీసు మీట్ పోటీలలో రాజా బ్రాస్ మెడల్ కైవసం చేసుకుందని, 2016 లో పోలీసు శాఖ వారు నిర్వహించే రిఫ్రెషల్మెంట్ విభాగంలో మొదటి స్థానం సాధించిందన్నారు. జిల్లా పోలీసు శాఖలో కేసుల చేదనలోను, జాబ్ విషయానికొస్తే సెన్సేషనల్ కేసుల విచారణలో కూడా ప్రధాన పాత్ర వహించిందని తెలిపారు.

2015 అవనిగడ్డ లో జరిగిన హత్య కేసు సాధనలోను, 2015 నూజివీడులో వృద్ధురాలి హత్య కేసులోనూ ఆధారాలు సేకరించి కేసు విచారణకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. 2018 లో ఏ.కొండూరు పోలీసు స్టేషన్ పరిధిలో భార్య- భర్తను  చంపిన కేసులో ఆధారాలు లభించకపోవడంతో రాజా గుర్తించిన ఆధారాలతో కేసును తేలికగా ఛేదించడం జరిగిందన్నారు.

6 సంవత్సరాల కాలం పాటు కృష్ణా జిల్లా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన రాజాకు కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం తరపున నివాళులు అర్పిస్తున్నామన్నారు. మృతి చెందిన రాజా జాగిలం స్థానంలో మరొక నూతన జాగిలానికి శిక్షణ ఇప్పించి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
 
6 సంవత్సరాల కాలం పాటు తనతో విధి నిర్వహణలో తోడుగా ఉన్న రాజా జాగిలం మృతితో డాగ్ హాండ్లర్ రవి కన్నీటి పర్యంతమయ్యాడు.
 
రాజా జాగిలం సాధించిన విజయాలు
1. హైదరాబాద్ మొయినబాద్ శిక్షణా సెంటర్లో సిల్వర్ మెడల్ సొంత చేసుకుంది.
2.  2015 హర్యానాలో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా 29 రాష్ట్రాలు పాల్గొనగా, అందులో రాజా జాగిలం బ్రాంజ్ మెడల్ సాధించి, ఒక లక్ష రూపాయల రివార్డును సొంతం చేసుకుంది.
3. 2016 సంవత్సరంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రెస్పెక్ట్ హెల్మెంట్ కోర్సు విభాగంలో మొదటి స్థానం సాధించింది. 
ఈ కార్యక్రమంలో ASP సత్తి బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, చిలకలపూడి సిఐ వెంకటనారాయణ, చంద్రశేఖర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.