బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (09:09 IST)

ఇంజనీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ​ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

దీని ప్రకారం ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌​, ఫీజుల చెల్లింపుకు అవకాశం ఉంది.  26 నుంచి 31 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించనున్నారు. నవంబర్‌ 1నుంచి 5 వరకు వెబ్‌ ఆప్షన్లు అవకాశం కల్పించారు.

వెబ్‌ ఆప్షన్ల మార్పులకు నవంబర్‌ 6 వరకు అవకాశం ఉంది. నవంబర్‌ 10న ఇంజనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయించగా నవంబర్‌ 10 నుంచి నవంబర్‌15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు.

ఇక నవంబర్‌ 15 నుంచి ఇంజనీరింగ్‌, ఫార్మసీ తరగతులు ప్రారంభం కానునున్నాయి.