శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:18 IST)

కొడాలి నానీ ఏదో పీకుతానంటున్నాడు.. ఏంపీకుతాడో రమ్మనండి చూస్తాం: మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని, చింతమనేని

జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటే వైసీపీకార్యకర్తలకు బీపీవచ్చి, రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడిచేశారని, ఆయనే చెబుతున్నాడని, గతంలో ఇదేవ్యక్తి చంద్రబాబుని ఉద్దేశించి అభ్యంతరకమైన భాష వాడినప్పుడు ఆనాడు టీడీపీవారికి బీపీరాలేదా.. వచ్చినా వైసీపీ కార్యాలయాలపై దాడులుచేశారా అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేక్లుప్తంగా మీకోసం...
 
జగన్మోహన్ రెడ్డిచెబుతున్న బీపీ ఆయనకు, ఆయనపార్టీ వారికే పరిమితమైందికాదు. టీడీపీవారు మనుషులే..వారికీ అదే బీపీ ఉంటుంది. టీడీపీకార్యాలయాన్ని వైసీపీవారు పగలగొడితే, వైసీపీ కార్యాలయం సహా, తాడేపల్లి కొంపను ఎందుకుకూల్చలేదని మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ప్రశ్నించారు. తాడేపల్లి కొంప ప్రజల ఆగ్రహంతో ఎప్పుడోకూలిపోయిందని, దాన్ని కొత్తగా మనం కూల్చ వలసిన పనిలేదని చెప్పాను.

వారికొంప అలా కూలబట్టే, వారంతా ఇతరులకొంపలు కూల్చడానికి, రాష్ట్రాన్ని అరాచకశక్తులకు అడ్డా గామార్చి, రాష్ట్రంలోని స్థితిగతులను మార్చేసేపనిలో పడ్డారు. వైసీపీప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అధికారపార్టీ కార్యకర్తలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం గల వ్యక్తి అధికారంలోఉంటే, ఎలాఉంటుందో ప్రజలకు తెలుసు,ఇప్పుడుప్రత్యక్షంగా చూస్తున్నారుకూడా. 

వైసీపీప్రజాప్రతినిధులు, మంత్రులు తెగసంబరపడుతూ, ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. కానీ స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబులు నేర్పిన సంస్కారం, సంయమనం మాకు అడ్డుపడుతున్నాయి.  మీ సంగతి తేలుస్తామని, మిమ్మల్ని గోతిలో పాతిపెడతామని,  రండిరా చూసుకుందామని మేమూ అనగలం..కానీ అలా అంటే వారికి మాకు తేడా ఏముంటుందనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నవారిని గోతిలోపెట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకుంటున్నాం.

విర్రవీగవారిని సమూలంగా ఇంటిబాట పట్టించేందుకు అవసరమైన శక్తియుక్తుల తో రంగంలోకి దిగుతాం. ఆవేశపడి అనేమాటలకంటే, ఆలోచనతో గ్రామస్థాయినుంచి రాష్ట్రస్థాయివరకు పార్టీని పటిష్టంచేసుకునే పనిలో కార్యకర్తలంతా నిమగ్నంకావాలని కోరుతున్నా. అలాచేస్తే నే రాబోయే ఎన్నికల్లో టీడీపీ 165 కు పైగాస్థానాలు గెలుస్తుంది. అప్పుడు మనంఏంచేయకుండానే తాడేపల్లికొంపసహా, అన్నీ కొం పలుకూలుతాయి.

చంద్రబాబుగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని రెచ్చిపోయేవారందరూ ఒక్కవిషయం గుర్తుంచుకోండి.  40ఏళ్ల పార్టీలో వైసీపీవారికన్నా బరితెగించిమాట్లాడేవారు.. తెగించిపోరాడేవారు చాలామందిఉన్నారు. క్రమశిక్షణ మాకు అడ్డొస్తుంది తప్ప, కన్రెర్రచేయలేకకాదని గుర్తుంచుకోండి. 20 ఏళ్లు అధికారంలోఉంటామని ప్రగల్భాలు పలికినవారు, రెండున్నరేళ్లకే చేతులెత్తేశారు.

చివరకు ఉద్యోగులకుజీతాలుఇవ్వలేని దుస్థితికి దిగజారారు. 6లక్షలకోట్లవరకు అప్పులుచేసినా పింఛన్లు పెంచలేక పోయారు. ఇవేవీ చేయలేని అసమర్థులు చివరకు చేతగాక డీజీపీ కార్యాలయం పక్కనేఉన్న, టీడీపీ కార్యాలయంపైదాడిచేశారు. డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా పనిచేస్తున్న నాయక్ టీడీపీ కార్యాలయంపైకి దాడికి ఎందుకొచ్చాడు? కార్యాలయంపై జరిగిన దాడిలో పోలీసులహస్తముందని ఈ ఘటనే చెబుతోంది.

ఈ డీజీపీ రిటైరయ్యాక పరిస్థితిఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఈ ము ఖ్యమంత్రి దిగిపోయాక ఎవరిపరిస్థితి ఎలా ఉంటుందో పోలీస్ యంత్రాంగం కాస్త ఆలోచించుకుంటే మంచిది. డీజీపీ చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నకిందిస్థాయి పోలీస్ అధికారులుకూడా వారి భవిష్యత్ గురించి ఆలోచించుకుంటే మంచిది. అడ్డగోలుగా మాట్లాడేదానికి పదింతలు అనుభవించేలా చేస్తాము.

చంద్రబాబు ఆపినా కూడా టీడీపీకార్యకర్తలు ఆగనిరోజున మీరు ఎక్కడుంటారో  ఆలోచించు కోండి. చంద్రబాబు చెబితే ఎందుకు ఆగుతున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏమీచేయడని కొందరు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు మంచితనం మిమ్మల్ని ఎల్లకాలం కాపాడదు. ఆ విషయం బాగాగుర్తుపెట్టుకోండి. 

టీడీపీకార్యాలయంపై దాడిచేసినవారిని, చంద్రబాబుని దూషిస్తున్న వారి సంగతి అధికారంలోకివచ్చిన 24గంటల్లోనే తేలుస్తాం. అంకుశం సినిమాలో విలన్ ని కొట్టినట్టు నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతామని చెబుతున్నా. లోకేశ్ ని ఈ వైసీపీవారు ఒకవైపే చూస్తున్నారు.. రెండోవైపుకూడా చూడండి, అప్పుడుతెలుస్తుంది. ఇప్పుడు విర్రవీగేవారికి అధికారంలేనినాడు, ఒళ్లు, బట్టలు, డబ్బులు అన్నీ ఊడిపోవడంఖాయం.

ఖబడ్దార్ వైసీపీనాయకులా రా.. జాగ్రత్తగా మసలుకోండి. మీరుదాడిచేసింది 70లక్షలమంది టీడీపీకార్యకర్తల దేవాలయంపై, మిమ్మల్ని వెంటాడి శిక్షించేవరకు, గద్దెదింపి ఇంటిబాటపట్టించేవరకు వదలం. లోకేశ్ నాయకత్వంలో టీడీపీకార్యకర్తలు బరిలోకివస్తే, మీరు తట్టుకోలేరు. ఆరోజు త్వరలో నేవస్తుందని గుర్తుంచుకోండి.

చంద్రబాబుని తిరిగి ముఖ్యమంత్రిని చేసేవరకు, టీడీపీని అధికారంలోకి తెచ్చేవరకు నేతలు, కార్యకర్త లందరం సమరసింహాల్లా పనిచేస్తాం. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, ఇతర వైసీపీనేతలు పోలీసులను , వారికుటుంబసబ్యులను కూడా దూషించారు.మరి వాళ్లను ఈ పోలీసులు ఎందుకు అరెస్ట్  చేయ లేదు? పోలీస్అధికారులసంఘానికి ఆనాడు వైసీపీవారు మాట్లాడింది తప్పుగా కనిపించలేదా?  
 
చింతమనేని ప్రభాకర్  :
తెలుగుదేశంపార్టీ కేంద్రకార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి ఘటనపై ఇప్పటికీ మానసికంగా చాలా బాధపడుతున్నాం. దీనికి ప్రధానమైన కారణం పోలీస్ వ్యవస్థ వైఫల్యం. పోలీసులు వారుచేయాల్సిన పని చేయకుండా, అన్నివ్యవస్థలు కుప్పకూలిపోయేలాపనిచేస్తున్నారు. 

డీజీపీకార్యాలయం పక్కనున్న పార్టీ కార్యాలయానికే రక్షణ కల్పించలేని వారు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు? ముఖ్యమంత్రి గారు  తనపార్టీ కార్యకర్తలకు, అభిమానులకు బీపీలుపెరిగాయంటున్నా రు. శాసనసభలో స్పీకర్ తోసహా, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి,  చంద్రబాబునాయుడిని ఉద్దేశించి, బూతులు మాట్లాడినప్పుడు  ఈముఖ్యమంత్రి వికటాట్టహాసంచేసి, రాక్షసానందం పొందలేదా?

ఆ విధంగా ఈ రాష్ట్రానికిబూతుల సంస్కృతిని తీసుకొచ్చింది ఈ ముఖ్యమంత్రి కారా? పట్టాభి మాట్లాడిన బోషడీకే అనేపదం కేవలం ఊతపదం. దాని అర్థాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే వరకు చాలామందికి తెలియదు. ఒకపదానికి ద్వందార్థాలు తీసి, తనరాజకీయ పబ్బంగడుపుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబుని తిడుతుంటే ఈ ముఖ్యమంత్రి ఆనందపడ్డప్పుడు, ఆ పదాలకు అర్థాలువెతకాలని ఈయనకు అనిపించలేదా? చంద్రబాబుచేస్తున్న దీక్షను కూడా హేళనచేస్తున్నారు.

పిచ్చిపరాకాష్టకుచేరితే చంద్రబాబు దీక్ష దొంగదీక్షలానే కనిపిస్తుంది. పిచ్చిపరాకాష్టకు చేరబట్టే, మంత్రులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.  దొంగే దొరయితే అన్నతీరుగా పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి టీడీపీకార్యాలయంపై దాడిచేస్తే, దాన్ని మానాయకుడు పట్టించుకోకుండా వదిలేయాలా?  మా నాయకుడు చేస్తున్న దీక్షను కొడాలినాని కొంగజపమంటున్నాడు. అది ఏ దీక్షో, ఎలాంటిదీక్షో అలాంటివారికి ఏం తెలుస్తుంది?

టీడీపీ కార్యాలయంపై జరిగినదాడిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని దోషిలా నిలబెట్టడానికి తమనాయకుడుచేస్తున్న ప్రయత్నాన్ని అపహాస్యంచేస్తారా?  చంద్రబాబునాయుడి గారిని ఈవిధంగా చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి ప్రతిపక్షనేత దొరికినందుకు జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడని మరో మంత్రి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డిని గురించి దేశమంతా ఏమనుకుంటుందో ఆ మంత్రికి తెలియకపోతే ఎలా?

ఈ మంత్రులు నోటితో కాకుండా ఇంకోదానితో మాట్లాడుతున్నారు.  వైసీపీనేతల వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి తీరుపై రాష్ట్రప్రజలు ఒక్కసారి ఆలోచిం చాలి. మందిబలం, ధనబలం ఉన్నాయని విర్రవీగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీది వాపుమాత్రమే.. బలుపుకాదు. అది అధికారపార్టీ వారుగుర్తుంచుకుంటే మంచిది. దొంగఛానల్, దొంగ పేపర్ చేతిలో ఉన్నాయికదాని.. దొంగదీక్షలుచేస్తేప్రజలు నమ్ముతారు అనుకోకండి.

వ్యవస్థలు అన్నీ  భ్రష్టుపట్టాక ఏఎన్నికల్లో అయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది. జడ్పీటీసీఎన్నికలు తాము బహిష్కరిస్తే, వాటిలో గెలిచామని చంకలు గుద్దుకుంటా రా? అదే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మేం అడిగినప్పుడే  రీ నోటిఫికేషన్ ఇచ్చిఉంటే ఈ ప్రభుత్వానికి మాసత్తా ఏంటో చూపేవాళ్లం. అప్పుడుకాదు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వండీ...

మీకు మీపార్టీకి ముచ్చెమటలుపట్టించకపోతే, మాపార్టీనే మూసేస్తాం. గతచరిత్ర మర్చిపోయి మాట్లాడితే ఊరుకునేదిలేదు. రాష్ట్రం ఏమీ జగన్మోహన్ రెడ్డి అబ్బజాగీరుకాదు. కరోనాసమయంలో ప్రజలుచస్తుంటే ఈముఖ్యమంత్రిగానీ, ఆయన మంత్రులుగానీ బయటకురాలేదు. ముఖ్యమంత్రికి డప్పుకొట్టాల్సింది  పేదలు, ఆయనపార్టీవారుకాదు.

టీడీపీకార్యాలయానికివచ్చేక్రమంలో ఆర్టీసీ బస్సుఎక్కాను, ఆ బస్సులో  ఈ ముఖ్యమంత్రిని ప్రజలు తిడుతున్నతిట్లు, పట్టాభితిట్టినదానికంటే పదిరెట్లు అధికంగా ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి సాయంత్రం  ఆరు గంటలకు మద్యం దుకాణాల వద్దకు వెళితే తెలుస్తుంది...ప్రజలు తనగురించి ఏమనుకుంటున్నారో. తమరక్తాన్ని రంగు నీళ్లలా మార్చి దోచుకుంటున్నాడని వాపోతున్నారు.

టీడీపీప్రభుత్వంలో పచ్చగా కళకళ లాడిన పల్లెలు నేడుబోసిపోయాయి. రాష్ట్రంలో గంజాయి, మద్యం, నల్లమందు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వైసీపీ వారు దోపిడీచేయనిది ఏముందో చెప్పండి.సహజవనరులు సహా, ప్రజలనుకూడా దోపిడీచేస్తున్నది ఈ ముఖ్యమంత్రికాదా? మేం అననిదాన్నిపట్టుకొని ఉలిక్కిపడుతున్నారు. మరి మీరు చంద్రబా బుని అన్నప్పుడు మాకు ఎలా ఉంటుంది?

చంద్రబాబుని అసెంబ్లీ లో అంటున్నప్పుడుఈ ముఖ్యమంత్రి ఎందుకు వారించలేదు? తొత్తులాంటి డీజీపీని తనపక్కనపెట్టుకొనిఇష్టమొచ్చినట్లు పరిపా లనచేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? కొడాలినానీకి, నాకు, యరపతినేనిలాంటి చాలామందికి రాజకీయజన్మనిచ్చింది తెలు గుదేశంపార్టీనే. అభిప్రాయబేధాలు వస్తే తల్లిబతుకు తల్లిది.. బిడ్డ బతుకు బిడ్డది. కానీ నాని ఎందుకంతలా రోతగా మాట్లాడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే ఏదో పీకుతానని నానీ అంటున్నాడు. ఏంపీకుతావు రా... పీకుదువుగానీ. మీరు గొప్ప పీకుడుగాళ్లు మరి..మాకు చేతకాదు. కావాల్సిన మంత్రి పదవి ఇచ్చారుగా నానీ, మాటలెందుకు? నోరుందికదా అని పారేసుకోవ ద్దునానీ. ఎదిగినకొద్దీ ఒదిగిఉంటే అది అందరికీ మంచిది. బొడ్డూడ ని వెధవలతో కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టించాడు.

సభానాయకుడిగాఉండికూడా దగ్గరుండి మరీ వికటాట్టహాసం చేశా డు. అలాంటి ముఖ్యమంత్రి మాకు నీతులు చెబుతున్నాడు. రాయ లసీమలో అయితే ఖూనీలుచేస్తారని మరో ఎమ్మెల్యే అంటున్నా డు. ఎంతమందినిచంపుతారో చంపండి చూద్దాం. దొంగే దొంగ అన్నట్లుగా ప్రభుత్వంలోనివారువ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసినవారిని పోలీసులు వదిలేసినా, టీడీపీ వదలదు. ఫ్యాన్స్ఉన్నారంటున్నారు.. గాంధీనిచంపిన గాడ్సేకు కూడా ఫ్యాన్స్ఉంటారు.

టీడీపీకార్యకర్తలకు బీపీరాదా.. వారు ఉప్పుకారం తినడంలేదా? అధికారంశాశ్వతం కాదని గుర్తుంచుకోముఖ్యమంత్రి. వైసీపీనేతలు, కార్యకర్తలు కూడా పద్ధతిప్రకారం నడుచుకుంటే మంచిది.