మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:06 IST)

ఆమె కూడా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిది: వంగలపూడి అనిత

రాజ్యాధికారం కోసం చంద్రబాబానాయుడు ఎంతకైనా తెగిస్తాడన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో గురివింద గింజకూడా సిగ్గుతో తలదిం చుకుంటుందని, రాజ్యాధికారంకోసం ఎవరు తల్లిని వీధులపాలు చేశారో, ఎవరుచెల్లితో పాదయాత్ర చేయించారో, బాబాయిహత్యని ఎవరు రాజకీయంగా వాడుకున్నారో అందరికీ తెలుసునని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు వంగలపూడి అనిత దెప్పిపొడిచారు.

శుక్రవారం ఆమె మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే క్లుప్తంగా మీకోసం...
 
జగన్మోహన్ రెడ్డి ఏ రాజ్యాధికారంకోసం తన పిన్నమ్మ పసుపుకుంకుమలు, తాళిని తెంచాడో ప్రజలందరికీ తెలుసు. అదే రాజ్యాధికారంకోసం ఎంతమంది అక్కచెల్లెమ్మలకు ముద్దులు పెట్టా డో, ఎందరు తల్లుల తలలునిమిరాడో ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలే దు. ఆ రాజ్యాధికారంకోసమే ఈ ముఖ్యమంత్రి ఎందరు అభాగ్యులను అలవికానీ హామీలతో మోసగించాడో కూడా అందరి కీ తెలుసు. తనకు కావాల్సిన రాజ్యాధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎలావాడాలో అలావాడాడు.  ప్రజలను ఎలామోసగిం చాలో అలా మోసగించాడు.

ఈ ముఖ్యమంత్రి నిన్న పోలీస్ అమర వీరుల సంస్మరణ సభలో మాట్లాడిన మాటలు వింటే సిగ్గనిపిస్తోం ది. టీడీపీనేత పట్టాభిఅన్నమాటకు అర్థంవెతుక్కున్న ముఖ్యమంత్రి, ఆయన తల్లిని ఎవరూఏమీఅనకపోయినా, ఏదో అన్నారంటూ తనపరువుని తానే తీసుకున్నాడు. ముఖ్యమంత్రికి, ఆయన కుక్కలకు, భజనబృందానికి ఈ సందర్భంగా ఒక్కటే చె బుతున్నాం.

ముఖ్యమంత్రినిగానీ, ఇతర నేతల తల్లులు, వారి కుటుంబసభ్యులను టీడీపీ ఏనాడూ ఏమీ అన్నదిలేదు. పట్టాభి అన్నమాటకు అర్థంవెతుక్కొని, దానికి విపరీతార్థాలు తీసి, మీకు మీరే ఏదేదో ఊహించుకొని టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టిస్తు న్నారు. అకారణంగా ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దీన్నిబట్టే తనరాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ముఖ్య మంత్రి సాక్షాత్తూ పోలీస్ సంస్మరణ సభలో తనతల్లినిగురించి తానే అనకూడని మాటలు అన్నారు.

డీజీపీని డీజీపీ అనే పరిస్థితి లేదు. డీజీపీ అనేపదాన్ని సవాంగ్ గారు డీజేపీగా మార్చారు. డీజేపీ అంటే డైరెక్ట్ జగన్ పాలేరు. అలాంటి డీజీపీకి బాధ్యత గల పదవిలోఉన్న ముఖ్యమంత్రి మాట్లాడింది తప్పుగా కనిపించలే దా? ముఖ్యమంత్రి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడినా రాష్ట్రంలో సాగుతున్న గంజాయి, ఇతరమాదకద్రవ్యాలగురించి చెప్పరు.

ఆయన మాట్లాడిన ప్రతిసారీ అసలు విషయాలు పక్కనపెట్టి, ఇలా ఏవో వగలమారి ఏడుపులుఏడుస్తూ, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్ట తనపబ్బం గడుపుకోవాలని చూస్తాడు. తరువాత తనకేమీ తెలియనట్టే ఎప్పటిలా పబ్జీ ఆడుకుంటాడు. జగన్ కార్యక ర్తలకు బీపీ వచ్చిందా లేక జేపీ (జగన్ ప్లజర్) వచ్చిందా? ఒక్కసారి వైసీపీకుక్కలు జనంలోకి వస్తే, ప్రజల ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది.

ఒకమంత్రి గారుఅంటున్నారు... గాజులు తొడు క్కొని కూర్చోలేదని, ఆయన తల్లిచెల్లి, భార్యఇంట్లో గాజులు వేసుకొ నే ఉంటారు. ఆగాజుల చేతులు పనిచేస్తేనే సదరుమంత్రికి కడుపు నిండుతుంది. గాజులశక్తి ఏంటో మంత్రికి తెలియాలంటే ఆ గాజులు వేసుకొనేవారి జోలికి వెళ్లి చూడమనండి.

గాజులు, చీరలు ధరించినవారి కడుపునే ఈ మంత్రులు పుట్టారని మర్చిపోతేఎలా? పోలీసులు లేకుండా, పరదాలు లేకుండా బయటకురాలేని వారు కూడా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడితేఎలా? మీకు నిజంగా దమ్ము,ధైర్యముంటే అమరావతి ఆడవాళ్ల ముందుకు వెళ్లి మాట్లా డండి. అప్పుడుతేలుతుంది మీకున్న దమ్ము, ధైర్యమెంతో? 

అప్పుడప్పుడు ఒకావిడ సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చి మాట్లాడుతుంటుంది. జబర్దస్త్ లో కాల్షీట్లు లేనప్పుడు చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడుతుంది. ఆమెలాగా దిగజారి తాము మాట్లాడలేంకానీ, ఇకపై లోకేశ్ గురించి, చంద్రబాబుగురిం చి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే ఆమెకే మంచిది.

మా నాయకుడు ఏంచెప్పాల్సిన పనిలేదు మాకు. కాస్త సైలెంట్ గా ఉంటేచాలు, మాపని మేం చేసుకొని వచ్చేస్తాం. ఆయ న్ని చూసే మేం ఆగుతున్నామని గుర్తుంచుకోండి. మాటకు ముందు ఒక అమ్మను మాటకు తర్వాత ఒకఅమ్మను పెట్టి మాట్లా డే సన్నబియ్యం సన్నాసి ఏఅమ్మ కొడుకో ఆయనే చెప్పాలి.

అలాంటివ్యక్తులు మాట్లాడే మాటలు పోలీసులకు వినిపించవు.. కనపడవు. ఏ ఆడవాళ్లను అయితే కించపరిచేలా వైసీపీవారు మాట్లాడుతున్నారో, అవే ఆడవారి చేతులు వారి చెంపలు, ఒళ్లు పగలగొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తు న్నాం.