శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (14:41 IST)

ఇలాంటి దరిద్రపు లీకేజీల పేటెంట్ హక్కులు టీడీపీకీ సొంతం: ఐవైఆర్

అమరావతి ప్రజావేదిక వద్ద ప్లకార్డులతో ఆందోళన చేసినందుకుగాను కొంతమంది బ్రాహ్మణులను తీసుకురావాలని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని చెప్తున్నట్లు గల ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. టీడీపీపై మండిపడ్డారు. 
 
యామినిగారి ఆడియోను టీడీపీ అధిష్టానమే పచ్చ మీడియాకు లీక్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి దరిద్రపు లీకేజీల విషయంలో టీడీపీ అధిష్టానానికి, ఎల్లో మీడియాకు పేటెంట్ హక్కు వుందని ఎద్దేవా చేశారు. విపనేతలపై దాడిచేయడానికి యామిని వాగ్ధాటి పనికి వచ్చిందనీ, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇలా పక్కన పెట్టారని దుయ్యబట్టారు. 
 
ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్‌లో స్పందించారు. అవసరమైతే వాడుకోవడం.. అవసరం తీరిపోయిన వారిని పక్కనబెట్టేయడం టీడీపీకి బాగా అలవాటేనని కృష్ణారావు ఎద్దేవా చేశారు.