గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (09:44 IST)

కేంద్రానికి జగన్ ప్రేమలేఖలు: జవహర్

రాష్ట్రంలో 80శాతానికిపైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆ ధారపడి బతుకుతున్నాయని, ఏరువాకముగిసి, రబీసాగుకి రైతాంగం సన్నద్ధమవుతున్నా, అన్నదాతలకు అవసరమైన పచ్చిరొట్టవిత్తనాలను కూడా అందించకుండా ఏపీప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్. జవహర్ ఆరోపించారు. ఆయన తన నివాసంనుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 
 
ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన కృష్ణాజలాలపై తెలంగాణ లేవనెత్తిన నీటిసంక్షోభానికి తోడు, ప్రభుత్వం సృష్టించిన విత్త నసంక్షోభంతో సాగే సంక్షోభంగా మారబోతోందన్నారు. కృష్ణా జలాలు వృథాగా పోతున్నాకూడా ఈ ముఖ్యమంత్రి ప్రేమ లే ఖలతో కాలక్షేపంచేస్తున్నాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. పోయిబతిమాలుకున్నా మజ్జిగకూడా పోయరనితెలిసిన వాడు, పెరుగుకి చీటీలు రాసిపంపినట్లుగా ముఖ్యమంత్రి వైఖరి ఉందన్నారు.

కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావ త్ గతంలో ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ లేదని, ఈయనేమో తాపీగా ఆయనకు ప్రేమలేఖలు రాస్తు న్నాడన్నారు. తనపై ఉన్నకేసులకోసం రాష్ట్రప్రయోజనాల ను ఢిల్లీపెద్దలకు తాకట్టుపెట్టిన జగన్, మరోపక్క ఏపీ రైతాం గం ప్రయోజనాలను కేసీఆర్ కు తాకట్టుపెట్టడానికి సిద్ధమై పోయాడన్నారు.

ముఖ్యమంత్రి వ్యవహారమంతా దొంగ నాటకాన్ని తలపిస్తోందని, కేసీఆర్ విద్యుదుత్పత్తికోసం కృష్ణా నీటిని వృథాచేస్తున్నా, దానిపై నోరుమెదపలేని దుస్థి తిలో ఈముఖ్యమంత్రి ఉన్నాడన్నారు.  కేసీఆర్ – జగన్మోహన్ రెడ్డిల అన్నదమ్ముల అనుబంధం ఏపీ రైతాంగానికి శాపంగా మారిందని జవహర్ తేల్చిచెప్పారు.

ముఖ్యమంత్రి ఉత్తుత్తిలేఖలు రాయడం ఆపేసి, ప్రత్యక్షంగా కేసీఆర్ తో మాట్లాడో, లేక ఢిల్లీపెద్దలను కలిసి, వారిజోక్యంతో నో సాగునీటిసమస్యపరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అలాకాకుండా సన్నాయినొక్కులునొక్కుతూ, సజ్జలతో మాట్లాడించడం, మంత్రులతో పోసుకోలు కబుర్లు చెప్పించడం వల్ల సమస్యపరిష్కారంకాదన్నారు.

గతంలో టీడీపీప్రభుత్వంలో సాగునీటి యాజమాన్య పద్ధతులతో, జూన్ 10నాటికే డెల్టాప్రాంతానికి పూర్తిగా నీరందించడం జరిగేదన్నారు.   సాగునీటిపై ఆధారపడిన వ్యవసాయరంగం రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోతున్నా, వ్యవసాయమంత్రి విశాఖలో కూర్చొని భూదందా లుచేసుకుంటున్నాడని జవహర్ మండిపడ్డారు. భూకబ్జాల పై మంత్రికి ఉన్నశ్రద్ధ, వ్యవసాయరంగంపై లేదన్నారు.

రెండే ళ్లలో జగన్ ప్రభుత్వం ఎక్కడా వ్యవసాయయాంత్రీకరణపై, సాగునీటిపై దృష్టిపెట్టింది లేదన్నారు. ధాన్యం తడవకుండా కప్పుకునే పట్టలు (టార్పాలిన్లు) కూడా ఇవ్వలేని దిక్కు మాలిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ధాన్యం కొనేవారు లేక దళారులదోపిడీవ్యవస్థ కారణంగా రైతాంగం బస్తాకు రూ.300వరకు నష్టపోతోందన్నారు. 

రైతులనుంచి కొనుగోలుచేసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం ఇంతవరకు బకాయిలు చెల్లించలేదన్నారు. విత్తనసరఫరా, సబ్సిడీపై పాలకులు దృష్టిపెట్టలేదని, రైతాంగానికి అవసరమైన యం త్రాలు, ఇతరపనిముట్లను అందించేయోచన కూడా చేయ డం లేదన్నారు. రబీ ప్రారంభమైనా అన్నదాతల కళ్లల్లోంచి కన్నీళ్లు ఆగలేదంటే, ఈప్రభుత్వం వారికోసం ఎంతబాగా పని చేస్తోందో అర్థమవుతోందన్నారు.

గతేడాది పండించిన ఏ పంటకూ ప్రభుత్వం గిట్టుబాటుధర కల్పించలేకపోయిందని జవహర్ ఆక్షేపించారు. నకిలీవిత్తనాలు  మార్కెట్లను ముం చెత్తుతున్నా, తమకేమాత్రం పట్టనట్లు వ్యవసాయఅధికారు లు అధికారపార్టీ ఎమ్మెల్యేల సేవలో తరిస్తున్నారన్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటవేయాలి..ఏదైతే రైతులకు మంచిదనే సూచనలు వ్యవసాయశాఖనుంచి అందడంలేదన్నారు.

ముమ్మిడివరం మండలంలో ఇప్పటికే 800ఎకరాల వరకు పంటవేయకుండా రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటించారని, రాబోయేరోజుల్లో కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఇటువంటి పరిస్థితే తలెత్తే ప్రమాదముందన్నారు. సబ్సిడీపై రైతులకు అవసర మైన విత్తనాలు అందించడంగానీ, పంటలబీమా గురించి గా నీ ప్రభుత్వం ఆలోచించడంలేదన్నారు. ప్రభుత్వ, పాలకుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారిందన్నారు.

రాష్ట్ర రైతాం గం సామూహికంగా క్రాప్ హాలిడే ప్రకటించేవరకు పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు.  రైతులచేతిలో చుక్కతేనేవేస్తూ, మోచేతివరకు నాకిస్తున్నా డనే వాస్తవాన్ని రాష్ట్రరైతాంగం గ్రహించాలన్నారు. చేతగాని ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా, రైతులంతాతమకు కావాల్సి న వాటిపై ముఖ్యమంత్రిపై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

కృష్ణజలాల్లో అర్థభాగం తమవేనని కేసీఆర్ అనడం పై ఈముఖ్యమంత్రి అర్థరహితమంటూ ఆయనవాదనను  కొట్టేసిన వార్తనుకూడా తెలంగాణసాక్షిలో రాయలేని దుస్థితి లో సాక్షియాజమాన్యం ఉండటం సిగ్గుచేటని జవహర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకుసంబంధించిన వార్తను ఆంధ్రాలో ఒకలా, తెలంగాణలోమరోలా రాయడం చూస్తుంటేనే, ఈముఖ్యమంత్రి రైతులను ఎలామోసగిస్తు న్నాడో అర్థమవుతోందన్నారు.

సాక్షి పత్రిక వార్తలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కేసీఆర్ కుసాగిలబడ్డాడని అర్థమవుతోందని, పొరుగు ముఖ్యమంత్రి అర్థభాగమంటే ఈయనే జ్యేష్టభాగం సమర్పించేలా ఉన్నాడన్నారు.