శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (19:07 IST)

కరోనా వైరస్ కంటే జగన్ వైరస్ చాలా ప్రమాదకరం: చంద్రబాబు విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కంటే.. అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదమని తెలిపారు. ఈ రోజు పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ కాన్ఫరెన్స్‌లో 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కంటే జగన్ చాలా డేంజర్ అని తెలిపారు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి జనాలను నమ్మించగల ఘనుడని తెలిపారు.
 
కుల, మత, విద్వేషాలను రగిలించి శాంతిభద్రతలకు భంగం కలిగించడంలో ఆరితేరిన వారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణంగా మారిపోయిందని చెప్పారు.