5, 6 తేదీలలో జనసేన మేధోమధనం
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనుంది.
గతంలో రాజకీయాలు-ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయరంగం, సభలు-సమావేశాలు-చర్చ కార్యక్రమాలలో పార్టీ వాణిని సమర్ధంగా వినిపించడం, సమాచార హక్కు, న్యాయ-ధర్మ సూత్రాలు, పౌర పాలన, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై అవలోకనం, అవగాహనా సమావేశాలు జరుగుతాయి.
వివిధ అంశాలలో నిపుణులయిన వారు ఈ మేధోమధనంలో పాల్గొంటారు. రాజకీయవ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పి.ఏ.సి.సభ్యులు నాలుగో తేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.