మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (17:05 IST)

జనసేన మంగళగిరి సమావేశం... పార్టీ బలోపేతం, శాంతిభద్రతలపై సమీక్ష

Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, పీఏసీ స‌భ్యుడు నాగబాబు, ఇత‌ర ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. 
 
ఈ స‌మావేశంలో పార్టీ బ‌లోపేతం, రాష్ట్రంలో కౌలు రైతుల‌కు అండ‌గా నిలుస్తూ పార్టీ చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. 
 
అలాగే ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయయఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లే కేంద్రంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న హ‌త్య‌లు, అత్యాచారాలు, అమ‌లాపురం అల్ల‌ర్లు త‌దిత‌రాల‌పై స‌మావేశంలో కీల‌క చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.