1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (07:04 IST)

పదో తరగతి పరీక్షలు ప్రారంభం - నిమిషం ఆలస్యమైనా...

exams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు బుధవారం నుంచి మొదలవుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 
 
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. అంతేకాకుండా, ఈ యేడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏడు పేపర్లు మాత్రమే పరీక్షలు రాయనున్నారు.