హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించిన అనంతరం పవన్ భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పవన్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కొందరు ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఇకపోతే కరోనా లాక్ డౌన్ ప్రారంభం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.