అనంతపురంలో జనసేనకు '0', పవన్ కళ్యాణ్ టెన్షన్... సర్వే లెక్క ఇలా వచ్చిందేంటి?
ఇది నిజమో కాదో కానీ జనసేన సర్వే అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనకు జనంలో ఫాలోయింగ్ ఎలావుంది..? ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే జనసేనకు ఎన్ని స్థానాలు వస్తాయన్నదానిని తెలుసుకునేందుకు సర్వే చేయించారంటూ ప్రచార
ఇది నిజమో కాదో కానీ జనసేన సర్వే అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనకు జనంలో ఫాలోయింగ్ ఎలావుంది..? ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే జనసేనకు ఎన్ని స్థానాలు వస్తాయన్నదానిని తెలుసుకునేందుకు సర్వే చేయించారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సర్వేలో గణాంకాల ప్రకారం మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు 65 సీట్లు, తెదేపాకు 71 సీట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 39 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందట. ఉత్తరాంధ్రలో వైకాపాకు సీట్లు వచ్చే పరిస్థితి లేదట. అలాగే జనసేన రాయలసీమలో సీనులేదట.
ముఖ్యంగా షాకింగ్ విషయం ఏమిటంటే... అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా జనసేన గెలుచుకోలేదట. ఇక్కడ జనసేన పార్టీకి 0 ఫలితం మాత్రమేనని సర్వేలో వెల్లడయిందట. అందువల్ల పవన్ కళ్యాణ్ టెన్షన్ పడుతున్నారనీ, ఇందులో భాగంగానే ఆయన తను అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారని అంటున్నారు. మరి ఈ సర్వే నిజంగా జనసేన చేయించిందా... ప్రచారంలా సాగిపోతుందా... తేలాల్సి వుంది.