శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (16:34 IST)

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నాశనం చేసారు: జేసీ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసారనీ, ఆమె నిర్ణయం వల్ల తెలంగాణతో సహా ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఏడుస్తూ కూర్చోకుండా మరో దారి వెతుక్కోవడం మంచిదన్నారు. నాగార్జన సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి పరాజయం పాలవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.
 
జేసీ వ్యాఖ్యలతో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు జేసీ ఎవడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదయినా చెప్పాలనుకుంటే ఏపీ గురించి చెప్పుకోవచ్చన్నారు. సీఎల్పీలో వుంటూనే సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేశారని గుర్తు చేసారు. కేసీఆర్ కి జేసీ కోవర్టు అని అర్థమవుతోందన్నారు. జేసీ ఏదయినా జోస్యాలు చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవచ్చంటూ మండిపడ్డారు.