గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (10:32 IST)

జగన్ ఏమీ ఇవ్వలేదు.. అందుకే షర్మిల గూడు కదులుతోంది.. గోనె

షర్మిల కొత్త పార్టీ పెడతారని నాలుగు, ఐదు నెలల క్రితమే చెప్పానని వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడైన గోనె ప్రకాశ్ చెప్పారు. షర్మిల, బ్రదర్ అనిల్ ఇద్దరూ కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేశారని తెలిపారు. 'గూడు కదులుతోంది' అంటూ షర్మిల భర్త సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టు కొత్త పార్టీ గురించేనని అన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఉప ఎన్నికల కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 
 
2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని అడిగిన వెంటనే షర్మిల అంగీకరించారని చెప్పారు. 3 వేల కిలోమీరట్లకు పైగా పాదయాత్ర చేశారని తెలిపారు. ఉపఎన్నికల్లో విజయాలకు 99 శాతం షర్మిలే కారణమని వివరించారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారని, తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని... చివరకు ఏదీ ఇవ్వలేదని చెప్పారు. ఇదీ వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.
 
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అడ్వొకేట్ దగ్గరకు తన పీఏను షర్మిల పంపారు. ఇది ఎన్నికల సంఘానికి కూడా చేరింది. ఆ అడ్వొకేట్ ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి ఎంతో దగ్గరని గోనె ప్రకాశ్ తెలిపారు. సొంత పార్టీ ఏర్పాటు దిశగానే షర్మిల అడుగులేస్తున్నారన్న ప్రకాశ్.. జగన్ జైల్లో ఉన్నప్పుడు.. ఉపఎన్నికల కోసం షర్మిల ఎంతో ప్రచారం చేశారన్నారు. ఆ ఉపఎన్నికలో విజయానికి 99 శాతం షర్మిలే కారణమన్నారు. 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేయాలని అడగ్గానే షర్మిల అంగీకరించారు. 3 వేల కి.మీ.పైగా పాదయాత్ర చేశారు. ఆమెకు రాజకీయ ఆకాంక్షలున్నాయని ప్రకాశ్ తెలిపారు.