ganesh chaturthi

సీఎం జగన్‌కి కె.ఎ పాల్ శాపాలు

Written By జె
Updated: బుధవారం, 23 డిశెంబరు 2020 (16:49 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్. క్రిస్మస్ వేడుకలు జగన్ జరుపుకోవచ్చు.. కానీ మేము చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. ఇలా చేస్తే సర్వనాశనం కావడం ఖాయమంటూ శాపాలు పెట్టారు కె.ఎ.పాల్.
 
వైజాగ్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కె.ఎ.పాల్. స్టిక్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేయడమే కాకుండా సభ కోసం స్థలాన్ని చూసుకుని అందులో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆంక్షలను క్రిస్మస్ వేడుకలపై విధించింది. రోడ్లపైన బహిరంగ సభలు పెట్టడం.. హడావిడి చేయడం లాంటివి చేయకూడదంటూ షరతులను విధించింది. అయితే కె.ఎ.పాల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా కార్యక్రమానికి సిద్థమయ్యారు.
 
దీంతో విశాఖ నగర పాలకసంస్థ అధికారులు నేరుగా పాల్ ఏర్పాటు చేస్తున్న సభాస్థలికి చేరుకుని హోర్డింగులు, బ్యానర్లను ఎత్తుకెళ్ళారు. కె.ఎ.పాల్ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసుల వైఖరితో మండిపడ్డ కె.ఎ.పాల్ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments