గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 21 నవంబరు 2020 (16:48 IST)

జగన్ పాలనలో ఏడుకొండలు కబ్జా అయ్యే అవకాశం ఉంది, ఎవరు?

జగన్ పాలనలో ఏడు కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందన్నారు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఏడుకొండలను బిజెపి కాపాడుకుంటుందన్నారు. ఒక మత వ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారు. ఎపిలో అభివృద్ధి శూన్యమనీ.. అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ఎపి సిఎం దిట్ట అని విమర్శించారు.  
 
జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని.. ప్రతి పనిలో అలసత్వం, మౌలిక వసతులపై ఆలోచన లేదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంచలన ప్రకటనలు.. అనాలోచిత నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని, టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసిపి నాయకులకు దోచిపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 
 
జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్టబయలు చేస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత బిజెపికే ఉందని.. ఆధ్యాత్మిక నగరంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే అని చెప్పారు.  ప్రభుత్వ అవినీతి, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళతామని.. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకుండా అడ్డుకుంది టిడిపి, వైసిపి మాత్రమేనన్నారు.