ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (22:45 IST)

కార్తీ గారూ మిమ్మల్ని అభినందిస్తున్నా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Kaarti-Pawan Kalyan
తిరుమల లడ్డూ ప్రసాదంపై నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవి కాదనీ, ఒకవేళ అపార్థం అయితే మన్నించాలంటూ కార్తీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
 
కార్తీ గారూ... మీరు స్పందించిన తీరు చాలా సంతోషకరం. సంప్రదాయాలు పైన మీరు చూపిస్తున్న గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది శ్రీవారు భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటి లడ్డూ విషయంలో మాట్లాడేటపుడు మనం జాగ్రత్తగా వుండాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకే ఆ విషయాన్ని మీ దృష్టికి తెచ్చాను తప్ప నా వ్యాఖ్యలు వెనుక మరే ఉద్దేశం లేదు. 
 
అలాగే మీరు చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, అనుకోకుండా అలా జరిగిందని నేను అర్థం చేసుకున్నాను. సినిమా పట్ల మీరు చూపే నిబద్ధత, ప్రతిభకు నేను నా అభిమానాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే సూర్యగారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా మీరు జనరంజకమైన సినిమాలు నిర్మించాలని కోరుతున్నా... అని పవన్ చేసిన పోస్టుకి నటుడు కార్తీ ధన్యవాదాలు తెలియజేసారు.