పవన్ కల్యాణ్‌తో విజయ దేవరకొండకు కొత్త కష్టం.. ఏంటది?
విజయ్ దేవరకొండ "VD12"తో మళ్లీ బౌన్స్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదల ప్రణాళికలను వెల్లడించింది. మార్చి 28, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
విజయ్ దేవరకొండ అభిమానులు ఈ ప్రకటనను చూసి థ్రిల్ అయ్యారు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండకు పవన్ కళ్యాణ్ రూపంలో ఓ సమస్య ఎదురైంది. పవన్ కళ్యాణ్ ఈ వారం "హరి హర వీర మల్లు పార్ట్ 1" షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
త్వరలో షూటింగ్‌ను ముగించాలని ఆయన భావిస్తున్నారు. ఈ సందర్భంగా, మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇది మార్చి 28, 2025న విడుదల కానుందని ధృవీకరించారు.
"హరి హర వీర మల్లు పార్ట్ 1" ఆ తేదీన విడుదలైతే.. విజయ్ దేవరకొండ తన సినిమాను వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదు. ఆ విధంగా, పవన్ కళ్యాణ్ మేకర్స్ నుండి వచ్చిన హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ ప్రకటన విజయ్ దేవరకొండ సినిమాకు కష్టాలను తెచ్చిపెట్టిందని సినీ జనం అంటున్నారు.