పవన్ నైజం అలాంటిది... అతనిని మార్చడం సాధ్యం కాదు... కత్తి మహేష్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన తనదైన శైలిలో విమర్సనాస్త్రాలు సంధించారు సినీ విమర్సకుడు కత్తి మహేష్. గతంలో పవన్ పైన వ్యాఖ్యలు చేసి ఆ తరువాత అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసిన కత్తి మహేష్ కొన్నిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. కానీ తిరిగి మళ్ళీ పవన్ పైన విమర్సలు చేయడం ప్రారంభించారు. అది కూడా పదునైన విమర్సలతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసే విధంగా వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కళ్యాణ్ ఒక అవకాశవాది. రాజకీయాల్లో పవన్ లాంటి స్వార్థపరుడు ఉండటం బాధాకరం. వచ్చే ఎన్నికల్లోపు ఏదో ఒక పార్టీతో పవన్ కలిసిపోతాడు. ఇప్పుడు బిజెపి డైరెక్షన్లో పార్టీని నడుపుతున్నాడు. వారి దగ్గర డబ్బులు పుచ్చుకునుంటాడు. మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తుంటాడు. వారితో బేరం కుదిరితే అక్కడ కావాల్సినంత గుంజేసి ఆ తరువాత ఆ పార్టీలను తిట్టడం మానేస్తాడు.
పవన్ నైజం అలాంటిది. అతనిని మార్చడం సాధ్యం కాదు. ప్రజలు మోసపోకండి.. పవన్ కళ్యాణ్ అవకాశవాది.. స్వార్థపరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.