బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (11:30 IST)

400 ఏళ్ల చరిత్ర.. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు

pootharekulu
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోనసీమ ప్రత్యేక ఆత్రేయపురం పూతరేకులు భౌగోళిక గుర్తింపు (జీఐ) అందుకోనుంది. వచ్చే నాలుగు నెలల్లో సర్దార్ కాటన్ పూతరేకులకు భౌగోళిక గుర్తింపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రకటించారు. 
 
దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన మాకిరెడ్డి మనోజ్‌, ఆత్రేపురం పూతరేకుల సంఘం అధ్యక్షుడు, కలెక్టర్‌, సంఘం సభ్యులు హాజరైన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 400 ఏళ్ల చరిత్ర కలిగిన పూతరేకులు అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.