బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (10:38 IST)

కోనసీమ థగ్స్ నుండి ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ కు స్పందన

Simha, RK Suresh, Munishkanth, Sarath Appani,
Simha, RK Suresh, Munishkanth, Sarath Appani,
పాన్ ఇండియా లెవెల్ లో ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
థగ్స్ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో, ట్రైలర్ లు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని చిత్రం పై అంచనాలు పెంచాయి. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు  గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కించారు దర్శకురాలు బృంద. హ్రిదు హరూన్, శేషు పాత్రలో  మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఆకట్టుకునే నటన కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మొదటి వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. " వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా... " అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. అమ్మవారు పూనినట్లుగా  హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. ఆస్కార్ అవార్డ్ నామినీ అయిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి నాటు నాటు పాటను ఆలపించిన కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ నైట్ ఎఫెక్ట్ లో చిత్రించిన పాటలో విభిన్న లైటింగ్ తో డివైన్ వైబ్ ను తీసుకురాగలిగారు. కోరియోగ్రఫర్ టర్న్డ్ డైరెక్టర్ బృందా టేకింగ్ కోనసీమ థగ్స్ ఎంత ఇంటెన్స్ గా ఉండనుందో తెలిసేలా ఉంది. ఈ పాట విడుదలయిన కాసేపట్లోనే అద్భుత స్పందన తో ట్రెండింగ్ లోకి వెళ్లిపోవడం విశేషం.
 
థగ్స్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో ఫిబ్రవరి, 2023 లో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.
 నటీనటులు:
హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని మరియు తదితరులు