మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (12:34 IST)

బియ్యం కోసం పొరుగింటికి వెళ్ళిన బాలిక.. విరుచుకుపడిన కామాంధుడు..

ఏడేళ్ల చిన్నారిపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. బియ్యం కోసం వచ్చిన పొరుగింటి బాలికను ఇంట్లోకి పిలిపించుకున్న ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలానికి చెందిన ఏడేళ్ల బాలికను ఆమె తల్లి బియ్యం కోసం పొరుగు ఇంటికి పంపింది. 
 
ఆ చిన్నారి వెళ్లిన సమయానికి సదరు పొరుగింటి మహిళ ఇంట్లో లేదు. బాలిక రావడాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బియ్యం ఇస్తానంటూ బాలికను ఇంట్లోకి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంత సేపటికి కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి.. పొరుగింటికి వెళ్లి చూడటంతో ఈ బాగోతం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.