సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జులై 2019 (16:17 IST)

రోగి భర్తపై స్టాఫ్ నర్సు దౌర్జన్యం....

కృష్ణాజిల్లా నందిగామలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగి భర్తపై ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్ దౌర్జన్యం చేసింది. ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించింది. పైగా, ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాలు అడుగుతున్నారని అక్కడకు వచ్చే రోగులు ఆరోపిస్తున్నారు. 
 
అవుట్సోర్సింగ్ వారు అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారే వీరు చెప్పిందే వేదంగా ఇక్కడ సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సుమారు 100 గ్రామాలకు ఏరియా ఆసుపత్రి అయిన ఈ ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాలన చేసి నాణ్యమైన వైద్యం అందించేలా వృత్తి రీత్యా డాక్టరు అయిన స్థానిక ఎమ్.ఎల్.ఎ డాక్టర్ మొడితోక జగన్మోహనరావు ఈ ఆసుపత్రిని తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రాత్రివేళ ల్లో ఏదైన అత్యవసర కేసు(గుండె సంబందించి) ప్రైవేటు వైద్యులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయటం లేదనీ, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.