సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (15:54 IST)

రెడ్ జోన్ ఓ మహిళ ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

రెడ్ జోన్‌ ఓ మహిళ ప్రాణాలు తీసింది. కర్నూలులో ఓ మహిళ  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు ఆయాసంగా ఉండటంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు అక్కడున్న వైద్య సిబ్బంది నిరాకరించారు. ఇంకా రెడ్ జోన్‌లో వున్నవారికి వైద్యం అందించబోమన్నారు. 
 
ఒక్క ఇంజక్షన్ ఇచ్చి మహిళా పేషంట్‌ను ఇంటికి పంపించేశారు. అయితే ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆ మహిళ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. తన తల్లికి వైద్యం అందించి ఉంటే బతికి ఉండేందని కొడుకు ఆరోపిస్తున్నాడు. తల్లి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కర్నూలులో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది.