సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 ఏప్రియల్ 2018 (19:29 IST)

నా అడుగు గుంటూరు యాజలి నుంచి మొదలైంది... లక్ష్మీ నారాయణ

తన అడుగు గుంటూరు జిల్లా యాజలి రైతుల వద్ద నుంచి ప్రారంభమైందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా యాజలిలో ఆయన మాట్లాడుతూ... రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని మహారాష్ట్ర సర్కారుని కోరినట్లు తెలిపారు. ఐతే తను చేసింది ఐపీఎస్‌

తన అడుగు గుంటూరు జిల్లా యాజలి రైతుల వద్ద నుంచి ప్రారంభమైందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా యాజలిలో ఆయన మాట్లాడుతూ... రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని మహారాష్ట్ర సర్కారుని కోరినట్లు తెలిపారు. ఐతే తను చేసింది ఐపీఎస్‌ కాబట్టి  ప్రభుత్వం తనకు ఆ అవకాశం కల్పించలేదని చెప్పారు. అందువల్ల ఇక ఉద్యోగాన్ని వదిలేసి రైతులకు సేవ చేసుకునేందుకు బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 
 
విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు నవ్వుతూ బదులిస్తూ... వ్యవసాయ మంత్రినైతే రైతులకు ఎలా సాయం చేయవచ్చో తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు అన్నారు. నార్వే వంటి చిన్నచిన్న దేశాల్లో రైతులు బాగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారనీ, అక్కడ రైతులు మేలురకమైన గింజలను సేకరించి నిల్వ చేసి ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయిలో వున్నదన్నారు. మన రైతులు కూడా ఇలాంటివాటిపై దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు. 
 
మన రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులను వాడుతుంటారనీ, వాటిని ఎంత తక్కువగా వాడితే అంతమంచిదనీ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. కాగా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొని వుంది. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి.