అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్‌లో తెగ చర్చ సాగుతోంది. దీంతో మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రం "ది భూత్నీ" సినిమా ఈవెంట్‌లో ఆమె పాల్గొన్న నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారని, దాంతో ముఖ కవళికలు కూడా మారిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెట్టింట తనపై సాగుతున్న ప్రచారంపై మౌనీ రాయ్ స్పందించారు.
"నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఇతరులను ట్రోల్ చేస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం. ఎవరికి నచ్చినట్టు వాళ్లని ఉండనివ్వండి" అంటూ వేదాంత ధోరణితో మాట్లాడారు.
కాగా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన సినిమాల్లోకి అడుగుపెట్టారు మౌనీ రాయ్... "నాగిని" సీరియల్‌తో అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ నటించిన "గోల్డ్" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుంత ఆమె "ది భూత్నీ"లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ మూవీ ఏప్రిల్ 18న విడుదలకానుంది.