సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (13:02 IST)

లక్ష్మీపార్వతి నన్ను చంపేస్తానంటోంది... దర్శకుడు కేతిరెడ్డి

వైసిపి నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి చరిత్రపై తీయబోతున్న సినిమా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో సినిమాకు ప్లాన్ చేశారు. ఇక షూటిం

వైసిపి నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి చరిత్రపై తీయబోతున్న సినిమా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో సినిమాకు ప్లాన్ చేశారు. ఇక షూటింగ్‌కు వెళ్ళబోతున్న తరుణంలో కేతిరెడ్డికి థ్రెట్ కాల్స్ ప్రారంభమయ్యాయి. అటు తెలంగాణా, ఇటు ఎపిలో రెండు చోట్ల షూటింగ్‌లు జరుగనిచ్చేది లేదని, కేతిరెడ్డిని అడ్డుకుని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. 
 
దీంతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణా హోంమంత్రితో పాటు డిజిపిని కూడా కలిశారు కేతిరెడ్డి. అంతకుముందు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. సినిమా తీసుకునే హక్కు ఎవరికైనా ఉందని, అయితే సినిమాను తీయకుండా తనను చంపేస్తామని అడ్డుకుంటున్నారని, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసేందుకు తాను లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తీస్తున్నట్లు చెప్పారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.