గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (13:28 IST)

ఏపీలో నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం: మంత్రి గౌతంరెడ్డి, రోజా వివరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చే రాయితితో పాటు వాటికి అందించే మౌలిక సదుపాయాలు కల్పన, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి, ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా వివరించారు.
 
నూతన పారిశ్రామిక విధానాన్ని వారిరువురు కలిసి ప్రారంభించారు. ఈ పాలసీ 2020-23 మధ్య అమలులో ఉంటుంది. ఇందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలు పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీనికి వైఎస్సార్ వన్ పేరిట మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్‌తో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు.
 
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సీఎం జగన్ మహిళా పక్షపాతి న్నారు. రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ, ఇది యువతకు ఉపాధి కల్పిస్తుందని గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ రాయితీ కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు.