విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో నగిరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు

Roja
వి| Last Modified శుక్రవారం, 31 జులై 2020 (16:56 IST)
నగరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలిపారు. అనంతరం ఆమె ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. లక్ష్మీదేవి నట్టింటిలో నడిచి రావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కోరుకున్నారు. శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

గత కొద్ది రోజులుగా రోజా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె చిత్తూరులో సింగిరికోన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక శ్రావణ శుక్రవారం కావడంతో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.దీనిపై మరింత చదవండి :