సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (09:39 IST)

ఆంధ్రా కాలేజీలో లెక్చరర్ గొంతు కోసిన భర్త

knife
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలోని కాలేజీ క్యాంపస్‌లో గురువారం ఓ మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త గొంతు కోసి గాయపర్చాడు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. లెక్చరర్ అయిన సుమంగళిపై ఆ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సహాయం కోసం ఆమె కేకలు విన్న విద్యార్థులు ఆమెను రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు.
 
విద్యార్థులను చూడగానే దుండగుడు పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన సుమంగళిని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కళాశాలలో కామర్స్‌ బోధించే సుమంగళి భర్త పరేష్‌ మధ్య కొన్ని సమస్యల కారణంగా విడివిడిగా ఉంటోంది.
 
ఆమె పరేష్‌పై గృహహింస కేసు పెట్టిందని, విడాకులు కూడా కోరిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.