శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (13:46 IST)

మందుబాబు ప్రాణం తీసిన ఎగ్ ఆమ్లెట్

ఎగ్ ఆమ్లెట్ ఓ మందుబాబు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. ఈదులకంటి భూపాల్ రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి బచ్చన్నపేట గ్రామంలో నివాసిస్తుండేవాడు. కాగా గత రాత్రి స్థానిక మద్యం దుకాణంలోని మద్యం తాగుతూ ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుంటున్నాడు.
 
ఏమైందో ఏమోకానీ పొరపాటున ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇది గమనించిన పక్కనున్న మందుబాబు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
కాగా అప్పటికే భూపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.