Daily Horoscope
✕

ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

Written By సెల్వి
Updated: బుధవారం, 23 సెప్టెంబరు 2026 (11:04 IST)
Rainfall
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు గంటల్లో గంటకు 30-40 కి.మీ. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడటంతో, ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ప్రభుత్వం విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ జిల్లాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments