ప్రధాని మోడీ సంకల్పం చాలా దృఢం, అందుకే: శివరాజ్ సింగ్ చౌహాన్

MP CM
జె| Last Modified బుధవారం, 18 నవంబరు 2020 (15:47 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆలయంలో టిటిడి అధికారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.

ఆలయం వెలుపల ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆత్మనిర్బర్ భారత్‌గా తీర్చిదిద్దుతామని ప్రధాని సంకల్పించారని చెప్పారు. మోడీ సంకల్పం గొప్పదన్నారు. ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం స్వయంసమృద్థి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

కరోనా వైరస్‌ను త్వరలో అంతం చేయాలని శ్రీవారిని వేడుకొన్నట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానన్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రితో పాటు బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు.దీనిపై మరింత చదవండి :