గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (09:32 IST)

సింధియాకు మధ్యప్రదేశ్ ఓటర్లు చెక్ పెడతారా? ఉత్కంఠగా మారిన బైపోల్ రిజల్ట్స్!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే.. ఈ 28 సీట్లలో కనీసం 9 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తేనే ఆ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వ మనుగడ కొనసాగనుంది. లేనిపక్షంలో కుప్పకూలిపోనుంది.
 
నిజానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత జ్యోతిరాదిత్యం సింధియా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో విభేదించి తన వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వీరింతా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెంద‌డంతో.. మొత్తం 28 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు. 
 
అయితే ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఉత్కంఠ‌గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండ‌గా, మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చేసి 116. అయితే ఈ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ 9 స్థానాలు గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. లేనిప‌క్షంలో అధికారం కోల్పోయే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం భాతర‌తీయ జ‌న‌తా పార్టీకి 107 మంది స‌భ్యుల బ‌లం ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీకి 87 మంది స‌భ్యుల బ‌లం ఉంది.