ఓ భర్త... ఇద్దరు భార్యలు... లైవ్ స్ట్రీమ్ శృంగార బాగోతం.. ఎక్కడ?

video
ఠాగూర్| Last Updated: బుధవారం, 28 అక్టోబరు 2020 (17:22 IST)
అతనికి డబ్బుపై అమితమైన ఆశ. ఇందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా ఏమాత్రం వెనుకాడడు. ఈ దురాసే చివరకు చిక్కుల్లో పడేలా చేసింది. ఇద్దరు భార్యలతో పడక కదిలో శృంగారం చేస్తూ, తమ రాసలీలలను డేటింగ్ యాప్‌ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేశాడు. అలా రెండు చేతులో సంపాదించసాగాడు. చివరకు ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇపుడు చిక్కుల్లో పడ్డారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదీషా పట్టణానికి చెందిన 24 యేళ్ల యువకుడు కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఈ యువకుడు తనకున్న పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న పలు డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియాల్లో చురుకుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.

తొలుత బెంగళూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో యువతిని కూడా గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరితో కలిసి ఒకే ఇంట్లో ఉండసాగాడు. అంతేకాదండోయ్... పడక గదిలో కూడా ఇద్దరితో గడపసాగాడు.

పైగా, ఇద్దరు భార్యలతో శృంగారం చేస్తూ ఆయా దృశ్యాలను అశ్లీ యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడు. నిందితుడు పలు అడల్ట్ యాప్‌లలో ఖాతాలు తెరిచి, డీపీని లైక్ చేయగానే వారికి డెమో కోసం వందరూపాయలు చెల్లించాలనే మెసేజ్ వెళుతుంది. అందులో తన ఇద్దరు భార్యలతో జరిపిన శృంగార వీడియోలు కనిపిస్తాయి. నచ్చినవారు వాటిని చూడాలంటే అదనపు చార్జీలు చెల్లించాలని మరో సందేశం వెళుతుంది. ఇలా అనేక మంది యువత వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది.

అయితే, భర్త పెట్టే వేధింపులు భరించలేని రెండో భార్య తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు భార్యలతో ఈ లైవ్ స్ట్రీమ్ శృంగార బాగోతం బహిర్గతమైంది. బెంగళూరుకు చెందిన భార్య అతనికి లొంగిపోయి అతని దుశ్చర్యలకు సహకరిస్తూ రాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భార్య మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యలతో పడకగది దృశ్యాల వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసి నిందితుడు డబ్బు సంపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఒక భార్య 7 నెలల గర్భవతి కాగా, నిందితుడు ఈ బాగోతం ఆగస్టు నుంచి సాగిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.15.5 లక్షల విలువైన బంగారం, రూ.45వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వికాస్ పాండే చెప్పారు. నిందితుడిపై ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.దీనిపై మరింత చదవండి :