శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (13:20 IST)

భర్తకు మద్యం తాగించి కరెంట్ షాక్ పెట్టిన భార్య.. చిత్ర హింసలు..

కట్టుకున్న భర్త కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి చిత్ర హింసలు పెట్టాడు. రాత్రిపగలు అనే తేడా లేకుండా కొడుతూ పశువులా మీదపడి కామకోర్కెలు తీర్చుకున్నాడు. ఇలాంటి బాధలెన్నో ఆ భర్త పెట్టాడు. ఇపుడు సీన్ రివర

కట్టుకున్న భర్త కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి చిత్ర హింసలు పెట్టాడు. రాత్రిపగలు అనే తేడా లేకుండా కొడుతూ పశువులా మీదపడి కామకోర్కెలు తీర్చుకున్నాడు. ఇలాంటి బాధలెన్నో ఆ భర్త పెట్టాడు. ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లూ తాను భరించిన, అనుభవించిన బాధను భర్తకు తెలియజెప్పింది.


అదీ మద్యం తాపించి.. కరెంట్ షాక్ పెట్టి చిత్ర హింసలకు గురిచేసింది. అంతటితో ఆ మహిళ కోపం తగ్గలేదు. కట్టుకున్నోడు అని కూడా చూడకుండా చంపేసింది. ఇందుకోసం మరో ఇద్దరి సాయం తీసుకుంది. ఈ హత్య ఈనెల 8వ తేదీన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగిన ఈ హత్యపై పోలీసుల కథనం ప్రకారం.. గుగులోతు సరిత (35), సురేశ్ (40) భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుబోతుగా మారిన సురేశ్.. భార్య కూలి పనులకు వెళ్లి సంపాదించి తెచ్చిన డబ్బులను లాక్కుని మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. నిత్యం ఆమెను వేధించసాగాడు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ పెద్దలు ఇరువురినీ మందలించారు. అయినప్పటికీ సురేశ్ మారకపోగా, చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి.
 
దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 8న మాట్లాడే పని ఉందంటూ తన బంధువులైన ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలిచి.. వారితో పాటు భర్త సురేశ్‌ను వస్రాతండాకు తీసుకెళ్లింది. అక్కడ భర్తకు పీకల వరకు మద్యం తాగించింది. అనంతరం చిత్రహింసలు పెట్టింది. తాళ్లతో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చింది. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా బండరాయితో అతడి తలపై మోది హత్యచేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక తండా శివారులో ఉన్న పాశంబోడు గుట్టపైకి తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించింది. 
 
అయితే, ఇటీవల కొందరు గొర్రెల కాపరులు అటుగా వెళ్లగా, అక్కడ ఓ మనిషిని దగ్గంచేసిన ఆనవాళ్లు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు లాలితండాకు చెందిన సురేశ్ అదృశ్యమైనట్టు తెలిసింది. అతడి భార్య సరితను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఘోరం వెలుగుచూసింది. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.