శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:57 IST)

స్నానం చేస్తుండగా వివాహితను ఫోన్‌లో చిత్రీకరించి... లొంగదీసుకుని...

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌లో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. వివాహిత స్నానం చేస్తుండగా 45 ఏళ్ల రంగయ్య ఆమెకు తెలియకుండా ఫోన్లో వీడియో తీసాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు చూపించి ఫేస్‌బుక్‌లో పెడతాడనని బెదిరించి ఆమెను లొంగదీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌లో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. వివాహిత స్నానం చేస్తుండగా 45 ఏళ్ల రంగయ్య ఆమెకు తెలియకుండా ఫోన్లో వీడియో తీసాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు చూపించి ఫేస్‌బుక్‌లో పెడతాడనని బెదిరించి ఆమెను  లొంగదీసుకున్నాడు. 
 
అంతడితో ఆగకుండా, ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. వాటిని కొంతమంది, స్నేహితులకు, గ్రామస్థులకు చూపించాడు. వాళ్లు ఆ వీడియోలను తమ ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో సోమవారం ఆమె చౌటుప్పల్‌ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు.