సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (14:47 IST)

కన్నతండ్రే రోజూ అత్యాచారం చేశాడు.. ఆ బాలికకు ఆరోనెల.. ఎక్కడ?

కన్నతండ్రే కాటేశాడు. కన్నకూతురిపై కన్నేశాడు. ప్రతిరోజూ కూతురితో కామవాంఛను తీర్చుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే చివరికి కన్నకూతురుని గర్భవతిని చేసి పారిపోయాడు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా, కదిరికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. అతని కుమార్తె స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 
రోజూ పీకలదాకా తాగి ఇంటికి వచ్చే అతడు మద్యం మత్తులో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ అఘాయిత్యాన్ని ఆ బాలిక ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. పాఠశాలలో అనారోగ్యం కారణంగా బాధపడుతూ వచ్చిన బాలికను ఉపాధ్యాయులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న కీచకుడైన తండ్రి కోసం గాలిస్తున్నారు. ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం బాలికకు ఆరో నెలని, ఆమె చికిత్స అందిస్తున్నామని చెప్పారు.