ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆరు నెలల్లో మా భవన నిర్మాణం ప్రారంభిస్తాం.. మంచు విష్ణు

manchu manoj
మరో ఆరు నెలల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో మా సభ్యులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించారు. 
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాకి సొంత భవనం కట్టిస్తామని తెలిపారు. ఇదే నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్లామని, అందువల్ల ఆ హామీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే మరో ఆరు నెలల్లో ఈ భవన నిర్మాణానికి భూమి పూజచేస్తామని ఆయన వెల్లడించారు. 
 
మా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం నా ప్రధాన కర్తవ్యం. సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో తాను మాట్లాడలేదని చాలా మంది విమర్శించారు ఇపుడేమో టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి, పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ కూర్చొని మాట్లాడుకోవాలని తెలిపారు.