శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (17:23 IST)

ఆ వ్యక్తి ప్రతిసారీ మా అన్నయ్యను టార్గెట్ చేస్తున్నారు : మంచు మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఫైరయ్యాడు. మంచు విష్ణుపై విమర్శలు గుప్పించిన టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖుడిపై మంచు మనోజ్ విమర్శలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో తన సోదరుడు మంచు విష్ణును ఓ వ్యక్తి ప్రతిసారీ టార్గెట్ చేశారన్నారు. మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశారని, ఆఖరికి మా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి తన వయసుతో సంబంధం లేకుండా లేనిపోని మాటలు అన్నారని మంచు మనోజ్ అన్నారు.
 
"ఈ విషయం మా నాన్నకు చెబితే, అతడికి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. అతడి మాటలు పట్టించుకోవద్దు. వదిలెయ్ అన్నారు. అది నిజమే అనిపించింది. ఆ వ్యక్తి చుట్టూ ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నా, అతడు మాత్రం ఏ తపన లేకుండా జీవిస్తున్న విషయం అర్థమైంది. నాక తెలిసినంతవరకు పరిశ్రమలో అందరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, ఆ వ్యక్తి ప్రవర్తన మాత్రం భిన్నంగా ఉంటుందని" మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.