కులం పేరుతో దూషణ అంటూ మోహన్ బాబు, మంచు విష్ణులపై ఫిర్యాదు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు దాఖలైంది. వారి వద్ద గత దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు ఫిర్యాదు చేసారు.
అతడి కులం పేరుతో దూషించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ తాము రెండు రోజులు సమయం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందువల్ల మానవ హక్కుల కమీషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కాగా మంచు విష్ణు కార్యాలయంలో నాగశ్రీను 5 లక్షల రూపాయల విలువైన వస్తువులను దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐతే తనపై అక్రమ కేసు పెట్టారంటూ నాగశ్రీను ఆరోపిస్తున్నారు. మరోవైపు నాగశ్రీను కుటుంబానికి మెగాబ్రదర్ ఆర్థిక సాయం చేయడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.